ఎడారి లాంటి అడవిలో ఒక కోయిల కూసింది
అక్కడెక్కడో ఒక మామిడి చెట్టు ఉండి ఉంటుంది.
అదేదో పేగు బంధం కాదేమో
ప్రేమ బంధమై ఉండి ఉంటుంది.
నలుపు తెలుపుల మధ్య ఒక మెరుపు
ఇంద్రధనస్సు అయి ఉంటుంది.
నిశ్శబ్దంగా నింగి గుండెలో ఉరుము ఒకటి
ఆకాశాన్ని పగలగొట్టింది
దాని గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది.
వనమంతా కాల్చిన అశోకుడు నాటిన చెట్లు
ఇంకా దారి వెంట నిలబడే ఉన్నాయి.
మాటలు పడిపోయిన మేఘం ఇంకా ముత్యాలు రాలుస్తూనే ఉంది.
చూపులకు అడ్డంగా ఉల్కలు కురుస్తున్నాయి.
ఆకర్షణ రక్తాన్ని ఎక్కించిన వాతావరణం ఇంకా కోలుకోనేలేదు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో
ఏటి ఆనకట్ట తెగిపోయింది.
మౌనం హత్యతో రాత్రి పగలు ప్రేమను కన్నది.
ఎన్నిసార్లు నరికిన మొలకెత్తిన మానులా
ఎన్నిసార్లు రాలినా మళ్లీ చిగురించిన ఆకులా
ఎన్నిసార్లు విసిరేసిన మొలకెత్తిన విత్తనంలా
ఆకాశం అచ్చం అక్కలా అచ్చం ఒక చుక్కల!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి