ఆరోగ్యమే మహాభాగ్యము:- కోరాడ నరసింహా రావు!
ఆరోగ్యమే మహాభాగ్యము
 ఆరోగ్యములోనేఆనందం
  ఆరోగ్యము తోనే సిరి, సంపదలు...! 
అరోగ్యముంటేనే అభివృద్ధి

మన ఆరోగ్యం మన చేతుల్లోనే... 
  మన చేతల్లోనే... మన ఆహార, విహారాదుల్లోనే..! 

పరిసుబ్రత... స్వచ్చమైననీ రు,గాలి,ఆహార పదార్దాలు.!
   కాలుష్యాలకు దూరం-దూరం...!! 
  మంచి పనులనే చేస్తూ... 
 మద్యపాన ధూమ పానాది చెడులకు దూరం వుంటూ ...,భోజన, శయనాదులలో... సమయ పాలన పాటిస్తే..., 
ఆరోగ్యం మన సొంతం..., 

ఆరోగ్యమేదెబ్బ తింటే... 
 మనం అనారోగ్యంపాలైతే
ధన,కనక,వస్తు,వాహనాది ఎన్నెన్ని ఆస్తి, పాస్తులున్నా
 వ్యర్ధమే కదా....!! 

ఆరోగ్యము పోయినాకా... 
  ఎన్నున్నా.. ఆరోగ్యాన్ని తిరిగి తీసుకు రాలేవు కదా
ఆ ఆరోగ్యమే వుంటే... 
  ఎన్నయినా సంపాదించు కోవచ్చు...! 

మనిషి లక్షలు,కోట్లు సంపా దించటంకోసం పాటు పడటం కాదు... మంచి ఆరోగ్యముతో బ్రతకటంకో సం పాటు పడాలి...! 
 నిజమైన ఆనందము, సుఖము ఆరోగ్యము లోనే వున్నవి అనే సత్యాన్ని తెలుసుకో మనిషి.... 
  ఈ ప్రపంచములో నీవు ఉన్నన్నాలు...ఆరోగ్యముతో,ఆనందముగా బ్రతికిపో
      ******


కామెంట్‌లు