-ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల సందర్శన
-పిల్లలకు తాను రాసిన కథల పుస్తకం అందజేత
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లిలోని ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం శ్రీరాంపూర్ మండల తహసిల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు సందర్శించారు. తాను రాసిన "లిటిల్స్" బాలల (బైలింగ్వల్ - తెలుగు, ఇంగ్లీష్) కథల పుస్తకాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు అందజేశారు. ఇందులోని కథలను పిల్లల చేత చవించాలని ఆయన సూచించారు. అనంతరం తహసీల్దార్ పాఠశాల పిల్లలకు గణితం బోధించారు. చతుర్విధ ప్రక్రియలకు సంబంధించిన లెక్కలు వేస్తూ పిల్లల నుంచి జవాబులు రాబట్టారు. పిల్లలు చక్కగా స్పందించి, సరైన జవాబులు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలని జగదేశ్వరరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ తహసిల్దార్ జగదీశ్వరరావు రాసిన "లిటిల్స్" బాలల (బైలింగ్వల్ - తెలుగు, ఇంగ్లీష్) కథల పుస్తకంలో ఆసక్తిని రేకెత్తించే అద్భుతమైన 24 కథలున్నాయని, అవి పిల్లలు సులభంగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఎంత గానో దోహద పడుతాయన్నారు. ఇందులోని ప్రతి కథ నీతి, మంచి సందేశంతో కూడి ఉందని, ఇంత మంచి పుస్తకాన్ని రాసి, పిల్లలకు అందజేసిన జగదేశ్వర్రావుకు ఈర్ల సమ్మయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, కొంకటి శ్రీవాణి, పిల్లలు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి