చిన్నారి- జయా
ఆ చిన్నారికి
అది విగ్రహమని తెలీదు
మతం గురించీ అఆలూ తెలియవు
శిలువ బరువెంతో కూడా తెలీదు
ఎవరికో ఏదో సాయం కావలసి వచ్చిందని మాత్రమే తెలిసిందా 
చిన్నారికి
అంతే, 
ముందు వెనుకలు
ఆలోచించక
దిగింది సాయానికి...

కనుక 
అన్నీ తెలుసనుకునే పెద్దవాళ్ళమైన
మనం
ఆ చిన్నారి హృదయంతో
ఆ చిన్నారి కళ్ళతో
ఈ ప్రపంచాన్ని చూస్తే
బాగుంటుందేమో కదూ...
-------------


కామెంట్‌లు