ముందుకు సాగు
వెనక్కు మళ్ళకు
ప్రక్కకు వెళ్ళకు
ఎగాదిగా చూడకు
ఉరుములకు దడువకు
పిడుగులకు బెదరకు
హెచ్చరికలు లెక్కచేయకు
మందలింపులకు భీతిల్లకు
గమ్యం వీడకు
యత్నం ఆపకు
పయనం మానకు
ఆశయం సాధించు
మాటలు ముత్యాలు
చక్కగా ప్రయోగించు
తియ్యగా నుడువు
తెలివిగా ప్రవర్తించు
నవ్వులు చిందు
పువ్వులు చల్లు
మోములు వెలిగించు
మదులు మురిపించు
ప్రేమను పంచు
పరిమళాలు వెదజల్లు
వెలుగులు చిమ్ము
ఆనందాలు అందించు
గోతులు తీయకు
క్రిందకు తోయకు
క్రోధము చూపకు
పంతాలు పట్టకు
చక్కగా ఆలోచించు
మంచిని తలపెట్టు
సమాజశ్రేయస్సుకు పాటుపడు
సంఘానికి తోడ్పాటందించు
అన్యాయాలను ఎదురించు
అక్రమాలను ఖండించు
అవినీతిని అంతరించు
అబద్ధాలకోరులను దూరంపెట్టు
గెలుపుకు పొంగిపోకు
ఓటమికి కృంగిపోకు
గర్విష్టివి కాకు
సహనము వహించు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి