లాల్ సలాం :- కోరాడ నరసింహ రావు !

 భావకవిలో.... అభ్యుదయ భావాల అలజడి...!
  పీడిత, తాడిత జన జీవనాన్ని చూసి...
  హృదిలో  విప్లవ జ్వాలల అలజడి...!
  కేవల ఆత్మా నందానికో...
  పాండిత్య ప్రదర్శనకో, స్వలాభా పేక్షకో గాక 
 సమాజాన్ని చైతన్య పరచటమే కవిత్వపరమార్థమని , అదే ధ్యేయంగా... తన కలాన్ని ఖడ్గంగా మార్చి....
   పతితులార, భ్రష్టులార మీకు నేనున్నానని దోపిడీ వ్యవస్త పై సాహిత్యపు తిరుగుబాటు బావుటా ఎగుర వేసి యువతలో నవ చైతన్యాన్ని నింపి ముందుకు,మునుముందుకు నడిపించిన విప్లవ కవి మహనీయ శ్రీ శ్రీ నీకిదే నా లాల్ సలాం 💐🙏🌷🙏 
కామెంట్‌లు