ప్రేమగా తాకే గాలికి
పరిమళం కానుకగా ఇచ్చి
ప్రకృతిలో సుగంధం నింపమని
పూల కొమ్మకు నేర్పిందెవరు?
వాలిన పూల కొమ్మకు
వంగి ముద్దిడి వలపులన్నీ
చెవిలో తలపులన్నీ చెప్పమని
చిగురుటాకులకు చెప్పిందెవరు?
తొలి కిరణం వెలువడగానే
తళ తళా మెరుపులు నింపుకొని
తెలి నవ్వుల స్వాగతంతో
తరణిని పలకరించమనీ...
గలగలల సంగతులతో
వినసొంపుగా పాటలుపాడి
మేదినిని మేలుకొలపమని
చిన్ని చిన్ని అలలకు చెప్పిందెవరో?
గిరి శిఖరపు సిగపై
ధగ ధగ మెరిసే దినమణిని
భువికి వెలుగులు పంచగా
పంపమని తూరుపున తరిమిందెవరో?
అనునిత్యము అదేపనిగా
అనుగ్రహించి అరుదెంచి
అవనిని ఆశీర్వదిస్తూ
ఆమనిని కానుకగా తెచ్చిన ఆదిత్యునికి
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి