తల గీకుకుంటే
ఆలోచనలు తోస్తాయా
తల నిమురుకుంటే
గతఙ్ఞాపకాలు గుర్తుకొస్తాయా
తల బాదుకుంటే
తత్వం బోధపడుతుందా
తల కొట్టుకుంటే
తంటాలు తప్పుతాయా
తల పట్టుకుంటే
బాధలు తీరుతాయా
తల కట్టుకుంటే
నొప్పి తగ్గుతుందా
తల స్నానంచేస్తే
దేహం శుద్ధవుతుందా
తల వెంట్రుకలిస్తే
దైవకటాక్షం లభిస్తుందా
తల వంచుకుంటే
తప్పు ఒప్పుకున్నట్లేనా
తల ఎత్తుకుంటే
ఘనకార్యం చేసినట్లేనా
తల తిప్పుకుంటే
అయిష్టం వ్యక్తపరచినట్లేనా
తల గోడకుకొడితే
అన్యాయం జరిగినట్లేనా
తల ఎగరేస్తే
అంగీకారం తెలిపినట్లేనా
తల పనిచేయించుకుంటే
అందం ఆవహించినట్లేనా
తల తెంచుకుంటే
పాపాలు పరిహారమవుతాయా
తల ఊపితే
చెప్పినదానికి ఒప్పుకున్నట్లేనా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి