టూత్‌పేస్టుతో మహా అయితే ఎవరైనా ఏం చేస్తాం.... దంతాలను శుభ్రం చేసుకుంటాము.. అంతే కదూ... కానీ టూత్ పేస్టు వల్ల నిజానికి మనకు ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ టూత్ పేస్ట్ మనకు చాలా పనులకు ఉపయోగపడుతుంది. మరి దాంతో ఏయే పనులు చేసుకోవచ్చో ఇప్పుడిక్కడ తెలుసుకుందాం.
చర్మంపై ఏర్పడే ముడతలు, మచ్చలను తొలగించి, చర్మాన్ని బిగుతుగా చేయడంలో టూత్ పేస్ట్ బాగా పని చేస్తుంది. రాత్రిపూట ముడతలు ఉన్న ప్రదేశంపై కొద్దిగా టూత్ పేస్టును రాసి అలాగే వదిలేయాలి. ఉదయాన్నే నీటితో కడగాలి. ఇలా రోజూ చేస్తే ఫలితం ఉంటుంది. ఎండ వల్ల కందిపోయిన చర్మానికి తిరిగి పూర్వ రూపం రావాలంటే టూత్ పేస్ట్ ఉపయోగపడుతుంది. కొద్దిగా టూత్ పేస్టు తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి రాయాలి. కొంచెం సేపు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ సౌందర్యం పెరుగుతుంది. మొటిమలపై టూత్ పేస్టును రాసి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయాన్నే నీటితో కడగాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. స్మార్ట్ ఫోన్ తెరలను శుభ్రం చేసేందుకు టూత్ పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా టూత్ పేస్ట్‌ను తీసుకుని ఫోన్ స్క్రీన్‌పై రాయాలి. అనంతరం శుభ్రమైన వస్త్రంతో తుడవాలి. ఇలా చేస్తే ఫోన్ స్క్రీన్ మెరుస్తుంది. స్క్రాచ్‌లు ఉన్నా అంతగా కనిపించవు. దుస్తులపై పడే మరకలను తొలగించడంలోనూ టూత్ పేస్ట్ పనిచేస్తుంది. దుస్తులను ఉతికేముందు మరకలపై కొద్దిగా టూత్ పేస్టును రాయాలి. ఇలా చేయడం వల్ల మరకలు తొలగిపోతాయి. వెండి, ఇత్తడి వస్తువులు పాతగా కనిపిస్తుంటే వాటిపై కొద్దిగా పేస్టును రాసి అనంతరం నీటితో కడిగేయాలి. అయినా పాతగానే ఉంటే పేస్టును రాశాక ఒక రాత్రంతా అలాగే వస్తువులను వదిలేయాలి. ఉదయాన్నే నీటితో కడిగితే పాత్రలు మెరుస్తాయి. బాత్‌రూం సింకులపై పేస్టును రాసి నీటితో కడిగేస్తే సింకులు తళతళా మెరుస్తాయి. కాలిన గాయాలు, పురుగు కుట్టిన చోట పేస్టును రాస్తే నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. అద్దాలు మసకగా కనిపిస్తుంటే పేస్టును రాసి శుభ్రమైన గుడ్డతో తుడవాలి. అద్దాలు మెరుస్తాయి. సీడీలు, డీవీడీలపై స్క్రాచ్‌లు పడి పనిచేయకపోతే టూత్ పేస్టును రాసి శుభ్రమైన గుడ్డతో తుడవాలి. అనంతరం డిస్క్ లు పని చేసేందుకు అవకాశం ఉంటుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి