పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లిలోని ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం ముందస్తుగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, జయంతుత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య పిల్లలకు రూ.3 వేల విలువైన రాత (నోట్ బుక్స్) పుస్తకాలను అందజేశారు. వచ్చే వేసవి సెలవుల్లో హోం వర్క్ చేయడానికి వాటిని పిల్లలకు అందించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, ఆయన సమానత్వం కోసం పోరాడిన మహానీయుడని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య అన్నారు. అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఊషన్నపల్లి పాఠశాలలో ప్రీప్రైమరీ (నర్సరీ, ఎల్కేజి, యూకేజి) తరగతులను నిర్వహిస్తామని, రెండు గంటలు అదనంగా పని చేస్తూ ప్రాథమిక స్థాయి నుంచి ఐఏఎస్(కలెక్టర్) ఫౌండేషన్ కోర్సుతో పాటు నవోదయ కోసం ఉచితంగా ప్రత్యేక శిక్షణనిస్తామన్నారు. తల్లి దండ్రుల కోరిక మేరకు ప్రీప్రైమరీ (నర్సరీ, ఎల్కేజి, యూకేజి) తరగతుల పిల్లలకు హిందీ భాషను నేర్పిస్తామన్నారు. సకల సౌకర్యాలతో పాటు ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు సురేష్ కుమార్, శ్రీవాణి, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి:- -రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి