రాలిన పూలు!!:- ఎం. వి. ఉమాదేవి.
(ఆట వెలది)

ఉగ్రదాడి తోడ ఉన్మాద చర్యలు 
జాలిలేనియట్టి జాతియకట!
రోజపూల వనము రోదించుచున్నదే 
కుంకుమాదిపూలు కుమిలిపోగ!!

అందమైన లోయ! అల్లాడి పోవుచు 
శవపు దిబ్బలగుచు సంతరిల్ల
విగతజీవులకడ విలపించు వారితో 
కంటనీరు నొలుకు కాశ్మిరమున!!

తులిపు పూల తోట తుళ్ళిపడుచులేచి 
తూట సవ్వడివిని రాటతీరు!
పూలు రాలెనమ్మ పుట్టెడు శోకాన 
దేవదారు చెట్లు దీనమాయె!!


కామెంట్‌లు