అత్త కొడుకు వచ్చాడు
రెండు ఎడ్లు తెచ్చాడు
వాటికి మువ్వలు వేశాడు
ఎడ్లను బండికి కట్టాడు
వారు కట్టే చేతబట్టి
మెల్లిగా బండెక్కాడు
చిన్నగా ఎడ్లను కొట్టాడు
నాలుగు కాళ్లు లేపాయి
మువ్వల శబ్దం చేస్తూ
ముద్దుగా ఊరొచ్చింది
ఇంటి ముందాగింది
ఆనందంగా ఉరికాను
బండి వెనకకు వెళ్లాను
బావ బండి దిగాడు
నా దగ్గరకు వచ్చాడు
బుగ్గలు గిల్లి వెళ్ళాడు
బుంగమూతి పెట్టాను
తొంగి తొంగి చూశాను
బావా చూసి నవ్వాడు
పాలకోవా ఇచ్చాడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి