సీ.ప..శ్రీరామనవమి..:-డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-హైదరాబాద్
రామనవమి నాడు రాముడు సీతకు
కళ్యాణము జరుగు కడు పసందు

దేవాలయములందు దేదీప్య మానము
వివిధ కాంతులతోను వెలుగుచుండు

వీధివీధి మురియు విరులన్ని చేరగా
భక్తజనులతోడ పారుచుండు

సీతమ్మ తలపైన జీలకఱ్ఱ మరియు
బెల్లము రామయ్య మెరిసి పెట్టు

ఆ.వె
వైభవముగ జరుగు వేదమంత్రాలతో
అందరిమది దోచె అందగాడు
ధర్మమూర్తుడిలను ధార్మిక తత్వము
చాటగాను పుట్టె చవులు పుట్ట!!
-----------------


కామెంట్‌లు