అపుడే పుట్టిన పాప నవ్వులా
అంబరాన్ని అలముకున్న కాంతులతో
సంబరంగా మనసు మురిసి
బ్రతుకంతా వెలిగినట్టు....
వెలిగించిన జ్యోతికి
వత్తిని సరిచేసి చమురుపోసి
దేదీప్యమానమైన ప్రకాశంతో
ప్రజ్వలించమని వరమిచ్చినట్టు..
చుట్టుముట్టిన చీకట్లు
దిక్కుతెలియక దూరంగా
పరిగెత్తి దారిలేక వెలుగులోనే
కరిగి కలిసి పోయినట్టు...
వెలుతురు చుట్టాన్ని చూసి
వసుమతి...వేవేల వర్ణాల
సుమాలతో ముంగిట
రంగవల్లులు దిద్దినట్టు....
దిగులున నలిగి చిన్నబోయిన
మోమున చిన్ని నవ్వు మొదలై
వెన్నెలగా మనసంతా నిండి
కన్నుల నీరు నింపినట్టు....
మంగళకరమైన మార్పుకు
వేదికగా మారిన తూరుపు
వేడుకలెన్నో గుత్తిలా కూర్చి
కానుకగా తెచ్చి ఇచ్చే వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి