సుప్రభాత కవిత : - బృంద
మాటలకు అందనిదీ
చూపులకు చాలనిదీ 
హృదయాలను గెలిచేదీ
ఉదయాన అందమది!

పచ్చనాకుల శాలువాతో
ప్రకృతి భుజాలను కప్పి
ప్రపంచపు అందానికి
ప్రతీకగా  సన్మానించినట్టు...

పరికించే మనసులకు 
ప్రశాంతతనిచ్చి 
ప్రసన్న భావనలతో 
పలకరించి పరవశింపచేసే....

పుడమికి సొంతమైన 
పుత్తడి అందాలు 
పులకరించి మైమరపించే 
పసిడి వెలుగుల సోయగాలు...

అలసట తెలియక
అందాలతో కనువిందు చేసి
బాటసారి పయనాన్ని
ఆటలాగా మార్చే పరిసరాలు

ఎంత చక్కని ప్రకృతి 
భగవానుడొసగిన  బహుమతి 
పదిలంగా ఉంచే బాధ్యత 
నీది కాదటోయ్  సుమతీ...

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు