సుప్రభాత కవిత : -బృంద
చేరువనే ఉన్నా 
చేరుకోలేని దూరాలు 
చేయలేని పనులకై
చేతకాని కోపాలు....

మోస్తున్న గుండె బరువులు
మోపులై పెరుగుతున్నా
మోసులైన ఆశలతో
మోకరిల్లిన మమతలు.

వెలుగుల కడలి మధనంలో
వెలిగే బింబపు మెరుపులు
వేలుపుగా  వెడలి వచ్చి
వేడుకగా  విరిసే ఉదయాలు..

అంతులేని నమ్మకంతో 
అలుపు లేక సాగించే 
అంతరంగపు పోరాటంలో 
అందే విజయపు బావుటాలు.

ఆశలెన్ని అంకురించినా 
ఆరాటమే మిగిలేను తప్ప 
అంతర్యామి  ఆంతర్యం
అందుకోలేని అలస్యాలు.

పట్టుదలే ఆయుధంగా 
ప్రయత్నమే పరమావధిగా 
పంటిబిగువున ఫలితం కోసం
పడిగాపులైన మనసులకు

ప్రకాశంగా పలకరించే 

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు