డా.వి.డి రాజగోపాల్ చేతుల మీదుగా పోలయ్య కవికి ఘనసన్మానం
తాజ్ హోటల్లో ఆదివారం సాయంత్రం శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా డైరెక్టర్ మైన్స్ (రిటైర్డ్) మరియు మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ గౌరవాధ్యక్షులు డాక్టర్ వి.డి.రాజగోపాల్ ఆధ్వర్యంలో...డాక్టర్ అరవా రవీంద్ర బాబు సమన్వయకర్తగా జరిగిన కవి సమ్మేళనంలో...ప్రముఖ కవి రచయిత హైదరాబాద్ నివాసి పోలయ్య కవి కూకట్లపల్లి పాల్గొని..."పరస్త్రీని ఆశిస్తే పతనమే" శీర్షికతో కవితను గానం చేస్తూ...
"నాడు ధశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన 
"రెండు వరాలే"...రాముని పాలిట "శాపాలై"... పట్టాభిషేకం దక్కకగ పోగా 14 ఏళ్ళు 
వనవాసం చేయవలసి వచ్చిందని...

"లక్ష్మణుడు ఆవేశం ఆపుకోలేక కోపంతో శూర్పణఖ ముక్కుచెవులు కోసినందుకే 
పగబట్టిన పదితలల రావణాసురుడు 
సీతను అపహరించాడని...లక్ష్మణుని 
"కోపమే" సీతమ్మ తల్లికి "శాపమైందని"...

"మహా శివభక్తుడు తపస్సంపన్నుడైన 
రాక్షస రావణబ్రహ్మ పతనానికి కారణం 
పరస్త్రీ వ్యామోహంతో...కామదాహాంతో 
 పుణ్యవతి సీతమ్మను చెరపట్టడమేనని"...

చక్కని సందేశం ఇచ్చి ఆహూతులను అలరించినందుకు...దాదాపుగా 4000 
కవితలు వ్రాసి పోలయ్య కవి చేస్తున్న 
గొప్ప సాహితీ సేవకు కృషికి గుర్తింపుగా...
మహర్షి వాల్మీకి సంస్థ గౌరవాధ్యక్షులు
డా. వి.డి రాజగోపాల్... తెలుగు యూనివర్సిటీ పూర్వ రిజిష్ట్రార్ 
ఆచార్య డా. టి.గౌరీశంకర్...రిటైర్డ్ ఫారెస్ట్ 
ఆఫీసర్ ఎ.ఎల్ కృష్ణారెడ్డి...ప్రముఖ కవి నటుడు...సాధనాల వెంకట స్వామి నాయుడు...ప్రముఖ సీనియర్ కవి 
రామచంద్ర మౌళి...ఆశాలత తదితర సాహితీ
మూర్తులు పోలయ్య కవి కూకట్లపల్లిని 
ఘనంగా సన్మానించారు. కూకట్లపల్లి 
అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు...

ఈ సభకు ముఖ్యఅతిథిగా 
 గౌ.పార్లమెంటు సభ్యులు 
డా. బి. లక్ష్మణ్...హాజరై ఈ బుక్
విష్కరించి ప్రసంగించారు. నాటి రేడియో 
ప్రవచన కర్త కీ.శే.ఉషశ్రీ కూతురు 
శ్రీమతి డా. పురాణపండ వైజయంతి రామాయణంపై ఉపన్యాసించారు.

ఈ సందర్భంగా లవకుశ చిత్రంలోని 
పాటలకు చిన్నారులు చేసిన 
నృత్యాభినయం సభికులను 
విశేషంగా ఆకట్టుకున్నది.

తదనంతరం ఈ సభకు హాజరైన 
ముఖ్య విశిష్ట ఆత్మీయ అతిథులకు...
కవి సమ్మేళనంలో పాల్గొని శ్రీ సీతారాములను కీర్తిస్తూ కమ్మని కవితలను గానం చేసిన దాదాపుగా 60 మంది కవులకు,... కళాకారులకు...శాలువాలు కప్పి అందమైన మెమోంటోలతో డాక్టర్ వి.డి రాజగోపాల్ ఆత్మీయంగా సత్కరించారు. రుచికరమైన ఫలహారంతో సభ దిగ్విజయంగా ముగిసింది...

కామెంట్‌లు