పొట్టి పాము:- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
పుట్టలున్న పొట్టి పాము 
గట్టు మీదికి వొచ్చింది 
చుట్టూ తిరిగి చూసింది 
చెట్టు పైకి ఎక్కింది 

పిట్టగూడు చూసింది 
చిట్టచిట్ట ఊరికింది 
గట్టి పట్టు పట్టింది 
చిట్టి ఎలుక వచ్చింది 

చిన్నగా తోక కొరికింది 
కన్నములోన దూరింది 
పాముకు రక్తం వచ్చింది 
బుస్సు కొట్టి చూసింది 

గబగబ కిందికి వచ్చింది 
పుట్టలోనికి వెళ్ళింది
చిట్టి ఎలుక వచ్చింది 
పిట్టల తోటి ఆడింది 


కామెంట్‌లు