తిరుమలరావుకు శ్రీరామనవమి ఉత్కళాంధ్ర సాహితీ సత్కారం

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తూ, వర్క్ ఎడ్జిస్ట్ మెంట్ పై పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాలలో పనిచేస్తున్న కుదమ తిరుమలరావు ఉత్కళాంధ్ర సాహితీ సత్కారం స్వీకరించారు. 
శ్రీరామ నవమి సందర్భంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కవులతో నిర్వహించిన ఉత్కళాంధ్ర కవి సమ్మేళనంలో పాల్గొని కవిత వినిపించిన తిరుమలరావును నిర్వాహక బృందం అభినందిస్తూ సన్మానించారు. పలాస కాశీబుగ్గ  జనజాగృతి సాహితీ సాంస్కృతిక సమాఖ్య 75వ కార్యక్రమాన్ని పలాస లయన్స్ హాలు నందు నిర్వహించగా ఆహ్వానం అందుకున్న తిరుమలరావు పాల్గొని స్వీయ గీతాలను ఆలపించి అందరి ప్రశంసలు పొందారు. ప్రముఖ కవి బమ్మిడి సుబ్బారావు సమన్వయంతో జరిగిన కవి సమ్మేళనంలో తిరుమలరావుతో పాటు, ఒడిశా గుణుపూర్, ఉత్తరాంధ్రకు చెందిన కవులు పాల్గొన్నారు. తిరుమలరావు తన కవితలో దశరథ తపోధనం, వశిష్ఠ పుత్రకామేష్టి యాగం, రుష్య పుంగ మహర్షి యజ్ఞం, అగ్నిదేవుని పాయసం బహూకరణ, కౌసల్యాదేవి సంతానభాగ్యం ఫలితంగా రఘువంశాన శ్రీరాముని జనన నేపథ్యమంటూ రచించారు. త్రేతాయుగాన మహావిష్ణువు ఏడో అవతారమై, శ్రీ రామావతారం ప్రజా సంక్షేమైనదని చాటి చెబుతూ విపులీకరించారు. 
జన జాగృతి అధ్యక్షులు లయన్. డా. కుమార్ నాయక్, వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ డా. తెప్పల కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి లయన్ బండారు కాళిదాసు, సాంస్కృతిక కార్యదర్శి భాష్యం రవికుమార్, సహాయ కార్యదర్శి బచ్చల బాలరాజు, మల్లెపురం ఉమామహేశ్వరి, ఎం.రాజేశ్వరి, గజలక్ష్మి, హనుమంతు ఎండుదొర, ఎన్.కోదండరామయ్య, ఎస్.మధుసూదనరావు తదితరులు తిరుమలరావును జ్ఞాపిక, శాలువా,  పుష్పగుచ్చం, ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు కుప్పిలి వెంకట రాజారావు, తెరవే అధ్యక్షులు యు.నాగేశ్వరరావు, విశాఖ లయన్స్ క్లబ్ ఛైర్మన్ వి.వెంకటరంగనాథ్, సీనియర్ జర్నలిస్టు వంకల రాజారావు, శివజ్యోతి ప్రతినిధి పి.జోగారావు, బొంతు సూర్యనారాయణ, భోగెల ఉమాకవి, ఎం.ఉపేంద్రశర్మ, నృత్యకారిణి చిన్నారి భాష్యం లక్ష్య తదితరులు పాల్గొన్నారు. తిరుమలరావుకు శ్రీరామ నవమి వేదికపై సాహితీ సన్మానం గావించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం, తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు