మర్మమెరుగకలేక మతములు కల్పించి
యుర్విజనులు దుఃఖమొందుచుండ్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ.. వినుర వేమా.
నూతన విజ్ఞానం అభివృద్ధి అయ్యేకొద్దీ అనేకానేక శాస్త్రాలు శాఖోపశాఖలుగా విస్తరిస్తూన్నాయి. మానవశరీరంలో ఊపిరితిత్తులు, గుండె, కాలేయం వంటి మ్య్ఖ్యమైన అవయవాల మార్పిడి చేసే అమర్చే శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటే మరొకవైపు మూఢనమ్మకాలు, దేవుడు, దయ్యం, బాణామతి మంత్రాలు వంటివి సమాజంలో పెరిగిపోతున్నాయి. మనిషి సజీవ సమాధి అయితే మోక్షం లభిస్తుందని చావడానికి సైతం వెనుకాడని మౌఢ్యం కూడా వ్యాపిస్తోంది.సొంత పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని సైతం నరబలి ఇవ్వడానికి సిద్ధమౌతున్న అవాంఛనీయ వాతావరణం మన సమాజంలో చోటుచేసుకుంటుఉండడం బాధాకరం.మూఢ నమ్మకాలు వివిధ దేశాల సంస్కృతులలో ప్రబలంగా విస్తరించిన నమ్మకాలు. ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే, మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివిగా కనిపిస్తున్నాయి. ఈ రెండవ తరగతికి చెందిన నమ్మకాల్ని "మూఢ నమ్మకాలు" అంటారు. ఈ మూఢ నమ్మకాలు ఎక్కువగా చదువుకోనివారిలో, గ్రామాలలోను, ఆదివాసీ గిరిజన సమూహాలలో కనిపిస్తాయి.
మనిషిని మనిషి లాగా ఉండనివ్వదు,మనిషిని మూర్ఖం గా మారుస్తుంది ఈ మూఢ నమ్మకం. మనిషి జీవితాన్ని మరింత అభివృద్ధి చేసి, ఉన్నత మార్గాలవైపు నడిపించడం కోసం ఒకవైపు విజ్ఞానశాస్త్రాలు కృషి చేస్తుంటే,కొందరు చాందసులు తమ పబ్బం గడుపుకోవడం కోసం ప్రజల్లో మూఢనమ్మకాల్ని మరింత ప్రచారం చేస్తున్నారు.దాని విషప్రభావం సమాజాన్ని మళ్లీ వెనక్కి రాతియుగం నాటికి తీసుకుపోతోంది. ఎవరో ఏదో చెప్పారని వాటిని గుడ్డిగా నమ్మటం, ఎప్పుడో ఎవరికో ఏదో జరిగిందని ఆ పని చేస్తే ఇప్పుడు మనకు కూడా అదే జరుగుతుందని నమ్మడం, శాస్త్రీయత, హేతుబద్ధత లేకుండా ఉన్న విషయాలను విశ్లేషించకుండా, ఆలోచించకుండా పిచ్చితనంతో ఫాలో అయిపోవడం అసలు తగదు.ప్రక్కరాష్ట్రం కర్ణాటక మూఢనమ్మకాలు,‘అమానవీయ సాంఘిక చర్యలు, చేతబడి నివారణ, నిర్మూలన బిల్లును 2017 లోనే తెచ్చ్గింది. జాతీయ మహిళా కమిషన్ సూచనతో ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్, అసోం, మహారాష్ట్రలు మూఢనమ్మకాల్ని నిరోధించే చట్టాల్ని ప్రవేశపెట్టాయి. అయితే ఈ అంసంపై తెలుగు రాష్ట్రాలు ఇంకా తొలి అడుగు వేయకపోవడం దురదృష్టకరం. మూఢ, అనాగరిక విశ్వాసాలకు వ్యతిరేకంగా పౌరులందరూ ప్రచారం చేయాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి