పిల్లనగ్రోవి చెట్లు: - తాటి కోల పద్మావతి.

 నైలు నది వెంట ఉండే ఒక రకం చెట్ల కొమ్మలకు బొడిపెలు ఉంటాయి. వానిని పురుగులు తొలిచి రంధ్రాలు చేసుకొని అందులో దాగి ఉంటాయి. గాలివీచినప్పుడల్లా నుండి పిల్లనగ్రోవి ఊదినట్లుగా ధ్వని వస్తుంది. అందుకే వీటికి పిల్లనగ్రోవి చెట్లని వ్యవహరిస్తారు. వీటిని సోపర్ వృక్షాలని అంటారు. అదేవిధంగా ఎర్ర సముద్ర ప్రాంతంలో ఉన్నటు వంటి చెట్లు కూడా వాటి కాడలకు గల రంధ్రాల ద్వారా చక్కని సంగీతాన్ని వీనులకు విందుగా వినిపిస్తూ ఉంటాయి. ఆ రంధ్రాల గుండా గాలి సోకి సంగీతంగా మనకు వినబడుతుంది. మన దేశంలో బొంగు వెదుర్లు కూడా తుమ్మెదలా రంద్రాలతో పిల్లల ధ్వనిస్తుంటాయి..
అందుకే వీటిని పిల్లనగ్రోవి వృక్షాలని పిలుస్తుంటారు. 

కామెంట్‌లు