ఐక్యతే బలం :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
కుక్కా పిల్లి కోడి మూడు 
ఒకేచోట చేరాయి ! 
శత్రుత్వం మరిచాయి 
మిత్రులుగా మారాయి 

కుక్క బౌ బౌ అంటుంటే 
పిల్లి మ్యావ్ మ్యావ్
కోడి కొక్కర కో అంటూ 
కంచె చుట్టూ తిరిగాయి 

నక్క ఒక్కటి వచ్చింది 
పొద చాటుకు నతికింది 
కోడికి నాసు పెట్టింది
కుక్క దాన్ని చూసింది 

బౌ బౌమని అరిసింది 
కోడికి సైగ చేసింది 
కోడి నక్కను చూసింది 
చెట్టు పైకి ఎగిరింది 

పిల్లి మెల్లిగా వెళ్ళింది 
నక్క వెనుకాల చేరింది 
దాని తోక కొరికింది 
నక్క కాలికి బుద్ధి చెప్పింది 

మూడు నేస్తాలు కలిసాయి 
ముద్దుగా ముచ్చట పెట్టాయి 
ఐక్యతే బలమని చాటాయి 
యజమాని వద్దకు చేరాయి 


కామెంట్‌లు