ఒక దొంగ పోలీసులు తరుముతుంటే రామయ్య ఇంట్లో దూరాడు. రామయ్యతో "నేను దొంగను కాకున్నా నన్ను అనుమానించి పోలీసులు తరుముతున్నారు. దయచేసి రక్షించండి. మీ ఇంట్లో దాక్కుంటాను." అన్నాడు. పోలీసులు అక్కడికి వచ్చి, "ఒక దొంగ పారిపోతున్నాడు. ఇటువైపు ఎవరైనా వచ్చారా?" అన్నాడు. రామయ్య "ఎవరూ రాలేదు." అని అన్నాడు. పోలీసులు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు దొంగ బయటికి వచ్చి, కత్తి చూపి బెదిరించి, "మీ ఇంట్లోని విలువైన వస్తువులు మర్యాదగా ఇవ్వు." అన్నాడు. రామయ్య లోపలికి వెళ్ళి, వస్తువులు తీస్తున్నాడు. ఇంతలో పోలీసులు వచ్చి దొంగను అరెస్ట్ చేశారు.
అసలు జరిగింది ఏమిటంటే వచ్చిన వాడు తన ఇంట్లో దాక్కున్నాడు. తాను దొంగను కాదు అంటున్నాడు. చూద్దాం. రెండు నిమిషాలు ఆగి రమ్మని చిన్నగా పోలీసులకు చెప్పాడు. "మా ఇంట్లోకి ఎవరూ రాలేదు." అని గట్టిగా చెప్పాడు. పోలీసులు వెళ్లినట్లే వెళ్ళి దగ్గర్లోనే పొంచి ఉన్నారు. ఇప్పుడు దొంగను పట్టుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి