గాఢ నిద్రలో ఉన్నప్పుడు పక్కన పడుకున్న వారు ఎవరైనా గురక పెడితే అప్పుడు కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. గురక పెట్టే వారి పక్కన ఎవరైనా పడుకుంటే వారికి ఇక అస్సలు నిద్ర పట్టదు. ఈ క్రమంలో ప్రశాంతమైన నిద్రకు భంగం కలుగుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే గురక సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
గురక చాలా సాధారణమైన సమస్య. ఇది బాధితున్నే కాకుండా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెట్టే సమస్య. నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతోపాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసివేసి నిద్రలేమికి కారణమవుతంది. స్థూలకాయం, గొంతువారు, ధూమపానం వంటివి గురకకు ప్రధాన కారణాలు. అయితే గురక సమస్య నుంచి బయటపడటానికి అవసరమైన చిట్కాలు ఏమిటో చూద్దాం... ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. కొద్దిగా పిప్పర్‌మెంట్ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది. అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. దీంతో గురక సమస్య నుంచి బయట పడవచ్చు. ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. గురక సమస్య తగ్గుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి