హైదరాబాదు రవీంద్ర భారతిలో శుక్రవారం సాయంకాలం , జె. శ్యామల రాసిన "సంతోషాల గాలిపటం" పిల్లల కథాసంపుటి ఆవిష్కరణ అమరవాది ఫౌండేషన్ , తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యం లో జరిగింది . సభకు డా. పత్తిపాక మోహన్ అధ్యక్షత వహించగా డా. మృణాళిని ముఖ్యఅతిథి గా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు . ఈ సందర్భంగా తన బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పుస్తకాన్ని డా. వి. ఆర్. శర్మ అందరిని ఆకట్టుకునేలా పరిచయం చేసారు. . డా. చెరుకుపల్లి హారిక ఆహూతులకు స్వాగతం పలికారు డా. నామోజు బాలాచారి డా. మామిడి హరికృష్ణ బాల సాహిత్య ప్రాధాన్యతను వివరించారు. చొక్కాపు వెంకటరమణ మూడు కథలతో ఆకట్టుకున్నారు. శీల సుభద్రాదేవి పుస్తక విశేషాలను తెలియ చేశారు అతిథులను సాదరంగా సత్కరించిన జె. శ్యామల పుస్తక రచన నేపధ్యాన్ని తెలిపారు. డా. హారిక చెరుకుపల్లి ఆహూతులకు స్వాగతం తెలిపారు.డా. అమరవాది నీరజ స్వాగత వచనాలుపలికారు ప్రముఖ చిత్రకారుడు శివప్రసాద్ ప్రార్థనా గీతం తో సభ ప్రారంభమైంది . కార్యక్రమానికి , హితులు, స్నేహితులు, ప్రముఖులు హాజరయ్యారు.
ఆనందంగా "సంతోషాల గాలిపటం" ఆవిష్కరణ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి