సాహిత్యం
పాలసముద్రం
మొదలెట్టిస్తుంది మధించటం
సాగించమంటుంది వెన్నతియ్యటం
కవిత్వం
కల్పవృక్షం
ఇస్తుంది పువ్వులు ఫలాలు
నింపుతుంది కడుపులు మదులు
కవనం
కామధేనువు
త్రాగిస్తుంది అమృతం
చేరుస్తుంది ఆనందం
కవితలు
దీపాలవరుసలు
చిమ్ముతాయి వెలుగులు
తొలగిస్తాయి అఙ్ఞానాంధకారాలు
కైతలు
ప్రకృతికిప్రతిరూపాలు
చూపిస్తాయి చక్కదనాలు
కలిగిస్తాయి సంతసాలు
కవనాలు
మధురగీతాలు
విప్పిస్తాయి కోకిలకంఠాలు
వినిపిస్తాయి గాంధర్వగానాలు
కయితలు
వానజల్లులు
కురిపిస్తాయి అక్షరచినుకులు
పారిస్తాయి పదాలసెలయేర్లు
కవులకూర్పులు
వైవిద్యభరితాలు
విన్నూతనావిష్కరణలు
విచిత్రవ్యక్తీకరణలు
కైతగాళ్ళు
నియంతలు
తోచింది పుటలపైపెడతారు
రాసింది చదవమంటారు
కవివర్యులు
అపరబ్రహ్మలు
సృష్టిస్తారు కయితలు
సుసంపన్నంచేస్తారు సాహితీలోకము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి