న్యాయములు-843
"కుహక చకితో లోకః సత్యే ప్యపాయ మపేక్షతే" న్యాయము "
*****
కుహక అనగా వంచన,దగా, మోసము.చకిత అనగా వణుకుతున్న,భయపడిన,ఎవరికియైన,భయంతో,సంభ్రమంతో. లోకః అనగా ప్రపంచము,భూమి,మానవ జాతి, జనులు,సమూహము, వాడుక, తొమ్మిది లేకపదునాలుగు.సత్య అనగా నిజము ,వాస్తవము.ప్యపాయ అనగా ప్రమాదము, ముప్పేట, నష్టము లేదా ముప్పు.మపేక్షతే అనగా కోసం, అవసరమైన కారణం అనే అర్థాలు ఉన్నాయి.
ధూర్తులచేత మోసపోయిన వాడు సత్యములో కూడా అపాయం ఉందని అనుకుంటాడు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అసలు మోసం అంటే ఏమిటో చూద్దాం. మోసము అనగా ఎవరైనా ఒక వ్యక్తి తన యొక్క వాక్చాతుర్యంతో గాని, మాటలను మసిపూసి మారేడు కాయలు చేసి ఎంతో నేర్పుతో, ఎదుటి వ్యక్తులను నమ్మించి, వాళ్ళు తనను పూర్తిగా నమ్మే విధంగా మెప్పించి వాళ్ళ ఆస్తులను, నగలు నట్రా విలువైన వస్తువులను చేజిక్కించుకోవడం లేదా దొంగతనం చేయడాన్ని మోసమని చెప్పవచ్చు.
తెలుగులో పెద్దవాళ్ళు ఒక హెచ్చరిక చేస్తూ తరచూ ఓ ఉదాహరణగా చెబుతూ ఉంటారు.అదేమిటంటే ఒకసారి మోసపోతే అది వ్యక్తి యొక్క అమాయకత్వం.రెండవ సారి మోసపోతే అది అవివేకం, అజ్ఞానం. మూడోసారి మోసపోతే అది మూర్ఖత్వం అని అంటూ ఉంటారు.
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు మోసపోతే అది పూర్తిగా ఆ వ్యక్తి యొక్క తప్పే అనీ ఘంటాపథంగా చెప్పవచ్చు.
అయితే ఇలా ధూర్తులు ,వంచకుల చేతిలో మోసపోయిన వ్యక్తి మంచి వాళ్ళను కూడా అంత తొందరగా నమ్మలేడు. ఎందుకంటే అతని అనుభవం నేర్పిన పాఠాలు అవి. ఎప్పుడు ఎవరి వల్ల ఎలాంటి అపాయం ముంచుకొస్తుందోనని ప్రతి క్షణం భయపడుతూ ఉంటాడు.
నమ్మించి మోసం చేసే నయవంచకులు కొందరు మన చుట్టూ ఉన్న సమాజంలో ఉంటారు. అలాగని వాళ్ళను చూడగానే గుర్తు పెట్టుకోలేం కదా! తీయని మాటలతో ఇతరుల నమ్మకాన్ని ఉపయోగించుకుని మోసం చేస్తూ ఉంటారు.
ఇతరుల నమ్మకాన్ని పొందడానికి వీరు తమ రకరకాల హావభావాలు ప్రధర్శిస్తూ ఉంటారు . ఎన్నో రకాల ప్రలోభాలను ఎరగా చూపుతారు. మాటలతో నమ్మకాన్ని కూడగట్టుకుంటారు.ఇతరుల అవసరాలను, కోరికలను ఇట్టే అర్థం చేసుకుని వెంటనే చేసిపెట్టి, వారిని పూర్తిగా తమ వశం చేసుకుంటారు. అలా చేయడం వల్ల తాము పూర్తిగా మోసపొయ్యే వరకు.. అతడు అలాంటి వాడు కాడు అని గట్టిగా నమ్ముతాం ఎవరేం చెప్పినా పట్టించుకోం. ఎందుకంటే వీరు చుట్టుపక్కల వారితో చాలా మంచివారుగా పేరు తెచ్చుకుంటారు కాబట్టే అలాంటి వారిని.అంతగా నమ్మి మోసపోతుంటాం.
ఇక తర్వాత మోసపోయినది గ్రహించే లోపే జరగాల్సిందంతా జరిగిపోతుంది.
కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా మోసం చేయడంలో విజయం సాధించారంటే దానికి కారణం బలమైన నమ్మకం. అలా ముఖ్యంగా ప్రేమలో కూడా జరుగుతూ వుంటుంది. నమ్మకాన్ని వమ్ము చేస్తూ జీవితంలో మరెవరినీ నమ్మలేనంతగా మనసును గాయ పరుస్తారు.
ప్రస్తుత సమాజంలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో/ మోసగాళ్ళో తెలియడం లేదు కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. తమవైన రహస్యాలు, ఆర్థిక లావాదేవీలు ఇతరులకు చెప్పకుండా ఉంటేనే మంచిది. అదే ఈ" కుహక చకితో లోకః సత్యే ప్యపాయ మపేక్షతే న్యాయము "లోని అంతరార్థము. అది గ్రహించి బహు జాగరూకతతో నడుచుకోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి