9వ తరగతి విద్యార్థులకు దానగుణం కలిగిన కొంతమంది మహానుభావుల కథలు చెబుతున్నాడు తెలుగు ఉపాధ్యాయుడు వేంకటేశ్వర్లు. బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి, రంతిదేవుడు, కర్ణుడు మొదలైన వారి కథలు చెప్పారు. విద్యార్థులు అంతా ఆసక్తిగా విన్నారు. విద్యార్థులను దానగుణం అలవరచుకోమని హితబోధ చేశారు ఉపాధ్యాయుడు.
9వ తరగతి వార్షిక పరీక్షలు ముగిశాయి. వేసవి సెలవలు మొదలు కావడానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది. వేంకటేశ్వర్లు మాస్టారు 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్నాడు. "9వ తరగతి ప్రారంభంలో దానగుణాన్ని అలవరచుకోమని చెప్పాను కదా! మీరు ఏ మాత్రం పాటించారో ఒక్కొక్కరు లేచి చెప్పాలి." అన్నారు.
"నేను మోహన్ అనే విద్యార్థి చదువులో వెనకబడి ఉంటే ప్రతి పరీక్షలో నా జవాబులు చూపించి రాయించాను." అన్నాడు మహేశ్. "నేను రంగ అనే విద్యార్థి చదువులో వెనకబడి ఉంటే ప్రతిరోజూ వాడిని ఇంటికి పిలిపించి, సందేహాలు నివృత్తి చేస్తూ చదివిస్తూ ఉన్నాను." అన్నాడు రాము. "నేను బడి బయట అమ్మే చిరుతిళ్లకు నరేంద్రకు డబ్బులు లేకపోతే నేనే డబ్బులు ఇచ్చి తినిపించా. ఇది నిత్యం జరిగేదే " అన్నాడు రాఘవ. "మా నాన్న రకరకాల పండ్లు రోజూ నాకు తినమని ఇచ్చి పంపితే గీతకు కూడా ఇస్తున్నా సర్!" అన్నది వైదేహి. "మేము చాలా పేదవాళ్ళం సర్! నాకు ఏమైనా అవసరం ఉంటే సతీశ్ కొనుక్కోవడానికి డబ్బులు సాయం చేస్తాడు సర్!" అన్నాడు వాసు. ఇలా విద్యార్థులు మాట్లాడుతున్నారు.
ఆ తరువాత ఉపాధ్యాయులు ఇలా అన్నాడు. "మహేశ్ చేసిన పని చాలా తప్పు. తోటి విద్యార్థికి కష్టపడి చదవడం చేయాలి కానీ ఇలా చదువు రాని సోమరిగా తయారు చేస్తే వాడికి భవిష్యత్ ఉండదు. రాము చేసిన పని చాలా మంచిది. రామును చూసి నేర్చుకో మహేశ్. రాఘవ చేసే పని కూడా తప్పే.అనారోగ్య కారకాలైన చిరుతిండ్లను తినవద్దు. ఇతరులకు తినిపిస్తే ఇంకా పెద్ద తప్పు. సతీశ్ చేసిన సహాయం చాలా మంచిది." అని. విద్యార్థులు ఏది మంచి? ఏది చెడు? తెలుసుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి