శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో ఈరోజు ఏక్ భారత్ శ్రేష్ట భారత్ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ వేడుకల్లో విద్యార్థులు హరియాణ రాష్ట్ర సంప్రదాయ దుస్తుల్లో ఆ రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయ దుస్తులతో అందరినీ అలరించారు
విద్యార్థులు వివిధ వేషధారణలో అందరిని ఆకట్టుకున్నాయి
"ఏక్ భారత్ శ్రేష్ట భారత్" అనే నినాదం ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టారు ఏక్ భారత్ శ్రేష్ట భారత్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం:
దేశంలోని అన్ని ప్రాంతాల మధ్య ఐక్యత, సమగ్రతను పెంపొందించడం,
దేశంలోని వివిధ సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను ప్రోత్సహించడం, దేశంలోని యువతకు దేశభక్తి, పరోపకార భావాలను పెంపొంచడం మరియు వివిధ సంస్కృతుల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు మరియు ఉపాద్యాయులు సంధ్యారాణి, చిత్తలూరి సత్యనారాయణ, సంపత్ కుమార్, దామెర్ల కృష్ణయ్య, కుక్కడపు శ్రీనివాసు, శ్రీరాములు, సృజన, సంగీత, అనురాధ, శ్వేత, మల్లేష్,రాధ, జేబున్నీస,సహన, యూనుస్, రవి, వేణు, సరస్వతి, సువర్ణ, పావని, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి