ఒకప్పుడు కుంభాలు కుంభాలుగా
ఆప్యాయతల సిరులు ఒలకబోసిన వారే
ఈనాడు నిశ్శబ్దంగా మౌనంగా
ప్రేమంటే ఏమిటో తెలియనట్లు
కొంచెం కొంచెం కుంచించుకుపోతూ
అనురాగం వరదలై పారేది ఆనాడు
మరి ఇప్పుడూ...
ఎడారి పక్షుల్లా ఏమీ తెలియనట్టు
ఎవరికి వారే యమునా తీరిలా
ప్రేమ స్వచ్ఛమైన పారే నదిలా అప్పుడు
ఇప్పుడు కలుషితమైన కాలువలా
దీనిని కాలమహిమంటారా?
మీరే చెప్పాలి ?!
ఆప్యాయతల సిరులు ఒలకబోసిన వారే
ఈనాడు నిశ్శబ్దంగా మౌనంగా
ప్రేమంటే ఏమిటో తెలియనట్లు
కొంచెం కొంచెం కుంచించుకుపోతూ
అనురాగం వరదలై పారేది ఆనాడు
మరి ఇప్పుడూ...
ఎడారి పక్షుల్లా ఏమీ తెలియనట్టు
ఎవరికి వారే యమునా తీరిలా
ప్రేమ స్వచ్ఛమైన పారే నదిలా అప్పుడు
ఇప్పుడు కలుషితమైన కాలువలా
దీనిని కాలమహిమంటారా?
మీరే చెప్పాలి ?!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి