115 ఏళ్ల తర్వాత కనిపించిన మొక్క ఇది అంతరించి పోయిందనుకున్నా అరుదైన అరుదైన'రెబె'అనే ఔషధ మొక్క 115 ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఈ మొక్కను వైద్య పరిభాషలో'బెగొనియా టెసరి కార్బ'అని పిలుస్తారు. ఇది తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సబన్సీ రి జిల్లాలో విగుధ గ్రామంలో మారుమూల ప్రాంతంలోనూ, కనిపించాయి వీటిని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్సీ) కు చెందిన వృక్షా శాస్త్రవేత్తలు గుర్తించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ జాతి మొక్కలు ఇప్పటికీ జీవించే ఉన్నాయి. రాళ్లతో కూడిన తేమ ప్రాంతంలో అవి పెరుగుతున్నాయి. అని అరుణాచల్ లో బి ఎస్ ఐ కు చెందిన కేంద్రంలో పనిచేసేవారు కనుగొన్నారు. స్థానిక ఆదిన్ తెగలవారు ఈ మొక్కలను'బక చుర్బు''రెబె'అనే పేర్లతో పిలుస్తారు. వీటి ఆకులు పుల్లగా ఉంటాయి. ఆకులను తినడంతో పాటు కూరలలోనూ ఉపయోగిస్తారు. పచ్చడి చేసుకుంటారు. కడుపు నొప్పి శరీరంలో నీరు తగ్గిపోవడం వంటి సమస్యలకు గిరిజన తెగలు వీటిని ముందుగా ఉపయోగించడం విశేషం. జలగలను వదిలించడానికి ఈ ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు. ఈ మొక్కల పువ్వులకు నాలుగు రేకులు మాత్రమే ఉంటాయి. వాటిలో రెండు పెద్దవిగాను మరో రెండు చిన్నవిగాను ఉండి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 18 90లో బెగొనియా ఆనవాళ్లు కనిపించాయి. అప్పట్లో 18 79, 18 90 బ్రిటిష్ వృక్ష శాస్త్రవేత్త వీటి ఉనికిని ప్రస్తావించారు.
బెగోనియా టెసరి కార్బ. :- తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి