మొదటి 10 పుస్తకాలు చదవడంతోనే ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తిమనే భావం కలుగుతుంది. తత్వవేత్తతోనైనా లేదా నిపుణుడితోనైనా చర్చించగలమనిపిస్తుంది. దినచర్య, కాఫీ పట్ల ప్రేమను పెంచుకుంటాం. కేఫ్‌లలో నిశ్శబ్దంగా, ఏకాంతంగా ఉండే టేబుల్‌లను ఇష్టపడతాం.
50 పుస్తకాలు చదివాక పెన్ను చేతిలో పట్టుకుని రాయడం మైదలుపెడతాం. మంచి - చెడు పుస్తకాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ప్రారంభిస్తాం.
200 పుస్తకాలయ్యేసరికి, మనలో ప్రతిధ్వనించే వాటిని గుర్తిస్తూ, వివేచన యొక్క గొప్ప భావాన్ని అభివృద్ధి చేసుకుంటాం.
250 పుస్తకాల తర్వాత, రణగొణ ప్రపంచం నుండి దూరంగా ఉండటం ప్రారంభిస్తాం. సంగీతం, టీవీ షోల ప్రభావం క్రమంగా తగ్గుతుంది. పైపెచ్చు అటువంటి కార్యక్రమాల నుంచి తక్కువ ఆనందం పొందుతాం. స్వంత సృజనాత్మక ప్రపంచంలో ఉండిపోతాం. అభిరుచులను పంచుకునే సారూప్య వ్యక్తులకోసం గాలిస్తాం. ప్రశాంతతను, సంతృప్తిని వెతుకుతాం.
350 పుస్తకాల తర్వాత, మనకు తెలిసింది చాలా తక్కువని అనిపిస్తుంది. అసమర్థులమనే అభిప్రాయం కలుగుతుంది. మరింత జ్ఞానాన్ని పొందాలని తహతహలాడుతాం.
500 పుస్తకాల ద్వారా, మనల్ని మనం అద్దంలోకి చూస్తాం. స్వీయ, అఖండమైన అనుభూతిని అనుభవిస్తాం. ఇది మనలోని రచనా శక్తికి నాందీ పలుకుతుంది. మన నుంచి పూర్తిగా కొత్త కథ ఆవిష్కృతమవుతుంది.
అందుకే పుస్తకాలతో బంధం అసాధారణం. మనమేంటో తెలుసుకునేలా చేస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి