తెలుసుకుందాం! ...అచ్యుతుని రాజ్యశ్రీ

 సాధారణంగా మనం కూర్చున్నప్పుడు  కాళ్లు ఊపకూడదు అంటాం. కుర్చీ ని అటుయిటు తిప్పటం కలదని చేతుల్లో తిప్పటం  ఆరోగ్యానికి బీజం అని అంటున్నారు నేటి శాస్త్రవేత్తలు.ఇది చంచలస్వభావం అని పెద్దలు మందలిస్తారు.సభలు సమావేశాలు క్లాసులో అలా కాళ్లు చేతులు ఊపుతూ ప్రేక్షకులు విద్యార్థులుంటే అందరి దృష్టి మళ్లటం వాస్తవం!కానీ దీనివల్ల శరీరం చురుగ్గా ఉండి రోగాల బారిన పడకుండా కాపాడుతుందిట! శరీరబరువు ని తగ్గిస్తుంది. అలసటను పోగొడ్తుంది. కూర్చుని నించుని కాళ్లు ఊపటం మనం ఏకాంతంలో ఉన్నప్పుడు చేస్తే మంచిది.42 మంది కి ఓగణితసమస్య ఇచ్చి ఈప్రయోగం చేశారు.జుట్టు సరిచేసుకుంటూ పెన్నుతో ఆడుతూ కొందరు తేలిక గా లెక్కను సాల్వ్ చేశారుట.ఎక్కువ అలసట టెన్షన్ లేదు వారికి.ఒకచోట కూర్చుని ఫోన్ మాట్లాడటం కన్నాఅటుఇటు తిరుగుతూ మాట్లాడేవారిలో కొవ్వు తగ్గుతుంది.అలా కూచోకుండా వాకింగ్ కాళ్లు చేతులూపటం మంచి ఎక్సర్సైజ్! కానీ సభలో క్లాస్ లో అలా చేస్తే ఇతరులదృష్టి వారిపై పడి ఏకాగ్రత దెబ్బ తింటుంది సుమా🌹
కామెంట్‌లు