పెద్దకడబూర్ మండల పరిధిలోని,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంబదహాళ్ లో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న 67వ పుస్తకం "బడి అమ్మ ఒడి" పుస్తకావిష్కరణ తాజ్ మహల్ హోటల్,నారాయణగూడ ,హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.ముఖ్య అతిథి గౌరవ పార్లమెంటు సభ్యులు డా.కె.లక్ష్మణ్ గారు,వాల్మీకి సాహిత్య,సాంస్కృతిక సేవా సంస్థ గౌరవాధ్యక్షులు,విశ్రాంత భూగర్భ గనుల శాఖ అధికారి డా.వి.డి.రాజగోపాల్ గారు,తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య శ్రీ టి.గౌరీ శంకర్ గారు, విశ్రాంత అటవీశాఖ అధికారి శ్రీ ఏ.ఎల్.కృష్ణారెడ్డి గారు ,అధ్యక్షులు డా.వి.యస్.రావు గారు మరియు కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథుల చేతుల మీద శ్రీరామ నవమి సందర్భంగా ఆవిష్కరించారు.అనంతరం జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న,అచిర కాల వ్యవధిలో 66 పుస్తకాలు రచించి,పలు చోట్ల వాటిని ఆవిష్కరించిన గద్వాల సోమన్న అవిరళ కృషిని గుర్తించి సత్కరించారు.సన్మాన గ్రహీత, కృతికర్త గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు అభినందించారు.
హైదరాబాద్ లో సోమన్న "బడి అమ్మ ఒడి" పుస్తకావిష్కరణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి