న్యాయాలు -831
శలభ న్యాయము
****
శలభం అనగా మిడుత.
"మిడుత దీపమును ఆర్పివేయును " అనే మాటను "దుష్టుడు మంచి వారికి కీడు చేయును" అనే అర్థంతో పోల్చి మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ముందుగా శలభం గురించి నాలుగు విషయాలు తెలుసుకుందాం.
మిడత అనేది ఒక రకమైన కీటకము.పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది మామూలుగా అయితే ఎవరికీ హాని చేయదు కానీ ఒకోసారి అన్ని మిడతలు కలిసి అనగా మిడతల దండు కలిసి పంటపొలాలను సర్వనాశనం చేస్తాయి.ఆ సమయంలో మిడతలు లక్షల సంఖ్యలో చేరి పంట పొలాలు, చెట్టు చేమలను చేరి ఒక్క క్షణంలో వాటి ఆకులను తినేస్తాయి. అవి దండుగా ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమవుతుంది.
అలాంటి మిడతల రకాల్లో ఒకటైన మిడత దీపాన్ని కూడా ఆర్పాలని చూస్తుంది.అందుకే ఈ మిడతను నీచుడు లేదా దుష్టుడితో పోల్చారు. అగ్ని శిఖ లేదా దీపశిఖ అందరికీ వెలుతురు ఇస్తుంది కాబట్టి దీప శిఖను మంచివ్యక్తితో పోల్చారు.
"ఉజ్వల గుణ మభ్యుదితం క్షుద్రో ద్రష్టుం న కథమపి క్షమతే,దగ్ధ్వా తనుమపి శలభో దీప్రం దీపార్చిషం హరతి."
"నీచుడు శ్రేష్ఠ పురుషుని గొప్పతనమును చూసి ఇంచుకంతైనా ఓర్వలేడు.తన ఒడలు కాలిపోవుచున్ననూ మిడుత వలె దీప్రమైన దీపశిఖను ఆర్పి వేయును"అని అర్థము.
నీచులు ,దురాత్మకుల గురించి సుమతీ శతక కర్త అయిన బద్దెన రాసిన పద్యాన్ని చూద్దామా!
"ఊరక సజ్జునుండొదిగి యుండిరి నైన దురాత్మకుండు ని/ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా/చీరెలు నూరు టంకములు చేసెడివైనను బెట్టెనుండగా/జేరి చినింగి పోగొరుకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా!"
అనగా "దురాత్మకుడు తన దుష్ట బుద్ధి చేత మంచి చీరలను చిమ్మెటలు కొట్టి ముక్కలు చేసినట్లుగా మంచివారికి కూడా అపకారము చేసి బాధిస్తాడు"అని అర్థము.
మంచిని సహించలేనంత ఓర్వలేని తనం దుష్టుల్లో వుంటుంది. వాళ్ళు ఇసుమంతైనా తోటివారికి సహాయం చేయరు.వారి జీవితంలో ఇతరులకు కీడు చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటారు.
మనం నిత్య జీవితంలో ఇలాంటి వారిని గమనిస్తూ వుంటాం. దీపాన్ని చేరే మిడత తన రెక్కలు కాలిపోతున్నా ఆగదు దీప శిఖను ఆర్పాలని పదే పదే దానిపైకి ఎగురుతూ వుంటుంది. అలా ఎగిరి ఎగిరి బాగా కాలిపోయి చనిపోతుంది. అలాగే దురాత్ములు కూడా. మంచివారి జోలికి వెళ్ళి వారికి హాని చేయాలని శత విధాల ప్రయత్నించి చివరికి తన ప్రాణాలను పోగొట్టుకోవడానికి కూడా వెనుకాడరు.కరడుగట్టిన దుష్టత్వానికి ఉదాహరణ వీరే అనిపిస్తుంది.రామాయణంలో రావణుడికి రాముడితో ఎలాంటి వైరం లేదు. కానీ సీతమ్మ ను చెరబట్టి కయ్యానికి కాలు దువ్వాడు.చివరి వరకు ఎన్నో మాయోపాయాలతో రాముడికి, సీతకు హాని చేయాలని చూశాడు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు.
కాబట్టి "శలభ న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే కొందరు దుష్టులు దుర్మార్గపు పనులు చేస్తూ వుండటం వారి మాటలు, చేతలను బట్టి గమనించాలి.అలాంటి వారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.మనకు మనం రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
ఇదండీ!" శలభ న్యాయము" లోని అంతరార్థము.అందుకే మన పెద్దలు చేప్పినట్టు ఇలాంటివి గమనించి చెడ్డ వారికి సాధ్యమైనంత దూరంగా ఉంఞలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి