మాచిరాజు బాలసాహిత్య పీఠం హైదరాబాద్ వారు ఫిబ్రవరిలో నిర్వహించిన జాతీయస్థాయి బడి పిల్లల కథల పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్గట్లలో ఏడవ తరగతి చదువుతున్న రూపక్ రాసిన చెట్లను కాపాడుకుందాం అనే కథకు బహుమతి లభించింది. మాచిరాజు బాల సాహిత్య పీఠం వారు గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీయడానికి జాతీయస్థాయిలో కథల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని, దానిలో భాగంగానే గత ఫిబ్రవరిలో ఈ పోటీలను నిర్వహించగా, సుమారు రెండు రాష్ట్రాల నుండి 542 కథలు రాగా దానిలో నుండి 30 ఉత్తమ కథలకు బహుమతులు ప్రకటించారని, అందులో రూపక్ రాసిన కథకు బహుమతి లభించిందని, త్వరలోనే హైదరాబాదులో జరిగే బహుమతి కార్యక్రమంలో నగదు బహుమతితోపాటు, జ్ఞాపిక, ప్రశంస పత్రం అందజేస్తారని తెలుగు పండితులు ప్రవీణ్ శర్మ తెలియజేశారు. జాతీయస్థాయిలో బహుమతి సంపాదించిన రూపక్ నీ పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కొమరగిరి కృష్ణాచారి మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.
జాతీయస్థాయి కథల పోటీలలో ఏర్గట్ల విద్యార్థికి బహుమతి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి