ఆరు ఋతువులు:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
అందరూ....
నేర్వాలమ్మా, నేర్వాలమ్మా
మన ఋతువులన్నీ ఆరే !!
తెలుసుకోమ్మా, తెలుసుకోమ్మా..
పన్నెండు మాసాలా పేర్లే!!

 వచ్చిందమ్మా! వచ్చిందమ్మా 
వసంత ఋతువు నేడే....
తెచ్చిందమ్మా, తెచ్చిందమ్మా 
చైత్ర, వైశాఖాలా తోడే....
ఇచ్చిందమ్మా! ఇచ్చిందమ్మా 
పచ్చని చిగుళ్ళు, పూలను నేడే!

వచ్చిందమ్మా! వచ్చిందమ్మా 
గ్రీష్మ ఋతువు నేడే....
తెచ్చిందమ్మా, తెచ్చిందమ్మా 
జ్యేష్ఠ, ఆషాఢాల తోడే....
ఇచ్చిందమ్మా! ఇచ్చిందమ్మా 
ఎండలను మెండుగా నేడే!

వచ్చిందమ్మా! వచ్చిందమ్మా 
వర్ష ఋతువు నేడే....
తెచ్చిందమ్మా, తెచ్చిందమ్మా 
శ్రావణ, భాద్రపదాల తోడే....
ఇచ్చిందమ్మా! ఇచ్చిందమ్మా 
వానలు, వరదలు నేడే!

వచ్చిందమ్మా! వచ్చిందమ్మా 
శరదృతువు నేడే....
తెచ్చిందమ్మా, తెచ్చిందమ్మా 
ఆశ్వయుజ, కార్తీకాల తోడే....
ఇచ్చిందమ్మా! ఇచ్చిందమ్మా 
వెన్నెల చల్లగా నేడే!

వచ్చిందమ్మా! వచ్చిందమ్మా 
హేమంత ఋతువు నేడే....
తెచ్చిందమ్మా, తెచ్చిందమ్మా 
మార్గశిర, పుష్యమాసాలా తోడే....
ఇచ్చిందమ్మా! ఇచ్చిందమ్మా 
తెల్లని మంచును నేడే!

వచ్చిందమ్మా! వచ్చిందమ్మా 
శిశిర ఋతువు నేడే....
తెచ్చిందమ్మా, తెచ్చిందమ్మా 
మాఘ, ఫాల్గుణ మసాలా తోడే....
చేస్తుందమ్మా, చేస్తుందమ్మా
పచ్చని చెట్టును మోడుగ నేడే!!
______


కామెంట్‌లు