అవసరానికి అష్టోత్తరం:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
వేసే పొగడ్తల దండల  విలువ...  
ఆ కొద్దిసేపు మాత్రమే.

ముక్కుసూటిగా వచ్చే 
ఏ మాటైనా 
 అందరికీ శత్రువే. 
చేదు గుళిక 
ఎవరికి మింగుడు పడుతుంది కనుక! 
అంతరాత్మకు అసలు
ఎలానూ తెలిసిపోతున్నా
ఒప్పుకోవటానికి  
మనసు అంగీకరించదు.

నువ్వు మాత్రం ముక్కుసూటిగా వుండు,
తప్పుల్ని ఎండగట్టు..
పొగిడే ప్రతీవాడు
ఆత్మీయుడు కాడు
అవసరానికి అష్టోత్తరమూ రచిస్తాడు.
ఫలం ఎక్కువుంటే 
సహస్రమూ సృజిస్తాడు.
_______


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
జీవిత సత్యాన్ని చెప్పారు
-satishbio
అజ్ఞాత చెప్పారు…
జీవిత సత్యాన్ని చెప్పారు
-satishbio