కళ్యాణం… కమనీయం:- -వి.వి.వి.కామేశ్వరి (v³k) వెలగలేరు
ప:
నీలాల నయనాల రాముని రూపు
నిలిపెను సీతమ్మ తల్లీ… సిగ్గుల మొగ్గై
కళ్యాణ రాముడే కాంతుడవ్వగ
ఆ తరుణం రమణీయం… కమనీయమే
॥నీలాల॥

1చ:
శివధనువు భారమని తరలించగ
కదిలించలేరైరి వీరులే స్వయంవరమున…
ఆజానుబాహువుడు ఏతెంచెనే
నారిని ఎక్కుపెట్టి సంధించగ
॥నీలాల॥

2 చ:
పెళపెళమని శ్రీరాముడు విల్లు విరువగ
సభికులు ఆనందసాగరాన ఓలలాడిరీ…
అందాల అవనిజయె పరవశించెనే
వరమాలను మెడలోన వేయబూనగ
॥నీలాల॥

3చ:
జగద్రక్షకుని పరిణయము సీతమ్మతో
శుభకరమని వేనోళ్ళ కీర్తించిరీ…
వీక్షించిన దేవతలే అక్షతలను
పూలజల్లుగ కురిపించి పరవశించగ
॥నీలాల॥



కామెంట్‌లు