విక్రమ ధీర -1 : - భరద్వాజ్ , సెల్ : 7075451597

 ఆది ఆ ఊరి చివర ఉన్న దట్టమైన అడవి ప్రాంతం.ఆ అడవి చూడటానికి చాలా అందంగా ఉంది. చుట్టూ పచ్చని చెట్లతో, ఆ చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలితో , అక్కడి ప్రకృతి ని చూడడానికి ఎపుడు వచ్చే పర్యాటకులతో ఎంతో సందడిగా ఉంది.. అక్కడ ఎవరి హడావిడి లో వాళ్ళు ఉన్నారు.. సెల్ఫీ లు తీసుకునే వాళ్ళు, యోగా చేసుకునే వాళ్ళు, ఆ ప్రకృతి అందాలకి తమని తాము మరచి పోయి ఊహల్లో తేలిపోయే ప్రకృతి ప్రేమికులు.. ఫోటో షూట్స్ చేసుకునే కొత్త జంటలు ఇలా అన్ని రకాల వ్యక్తులతో సుందర మనోహరంగా ఉంటే, ఒక 27 ఏళ్ల మైరా మాత్రం ఎవరినో వెతుకుతూ చాలా కంగారుగా అటు ఇటు వెళ్తున్న జనాలకి మొబైల్ లోని ఒక ఫోటో చూపిస్తూ , 
 
“ ఈ ఫోటోలోని బాబు ని చూశారా.. “
 
అని అడుగుతూ ఉంటే అందరూ మాకు తెలీదు, చూడ లేదు అని అన్న సమాధానాలే తప్పా ఏ ఒక్కరు పాజిటివ్ గా స్పందించడం లేదు.. వాళ్ళందరి సమాధానాలు విన్న మైరా.. ఇంకా కంగారు పడుతూ, 
 
“ రేయ్.. కన్నా , ఎక్కడికి వెళ్ళావ్ రా.. ఈ అమ్మ నీకోసం ఎంత లా కంగారు పడుతోందో తెలుసారా నీకు.. “
 
అని తనలో పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటు ఉంది.. అపుడే వెనుక నుంచి..
 
“ మైరా, కనిపించాడా.. “
 
అని అన్న ఒక మగ గొంతు సాఫ్ట్ గా వినిపించింది.. అపుడు వెనక్కి తిరిగి మైరా , 
 
“ విక్రాంత్ … “
 
అంటూ వెళ్లి అతని గుండెలపై వాలి పోయి.. 
 
“ లేదు విక్రాంత్ ఇక్కడ మొత్తం వెతికాను రామ్ ఎక్కడా కనిపించ లేదు.. “ 
 
అని , మైరా విక్రాంత్ వైపు చూసి.. 
 
నీకు కూడా కని పించ లేదా.. “
 
అని స్వరం తగ్గించి బాధగా అంటుంది.. దానికి మైరా ని చూసిన విక్రాంత్ . లేదు అన్నట్లు తల ఊపుతాడు.. 
 
కొన్ని గంటల క్రితం…
 
     వైజాగ్ సిటీ, భీమిలి2 బీచ్ కి 5 కిలో మీటర్ల దూరం లో… 
 
     “ రామ్, నాన్న రామ్.. లేవరా… “
 
అని కిచెన్ లో పాలు వేడి చేస్తూ కిచెన్ పక్కనే ఉన్న గది వైపు చూస్తూ, తన 10 సంవత్సరాల కొడుకు ని పిలుస్తుంది.. అక్కడ గదిలో రామ్ , బెడ్ మీద నిద్ర పోతూ ఉన్నాడు.. అపుడే ఒక దట్టమైన అందమైన అడవి తగల బడి పోతుంది.. ఒక మహర్షి ఆ మంటల్ని చూస్తూ ,దానికి కారణం అయిన వ్యక్తిని కోపము గా చూస్తూ.. 
అని దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తాడు.. ఆ అరుపుకి సమస్త లోకాలు ఒక్క క్షణం పాటు వణికి పోతాయి.. సరిగ్గా అప్పుడే , 
 
“ రామ్.. లే.. ఈ పాలు తాగు… “ 
 
అని ఆ గది తలుపు తోసుకుని లోపలికి వస్తుంది మైరా.. ఆ శబ్దానికి కలలో ఉన్న రామ్ ఒక్క సారిగా ఉలిక్కి పడి నిద్ర లేస్తాడు.. అతని శరీరం మొత్తం వణికి పోతుంది.. ముఖం మీద చమట తో నిండి ఉంది.. ఆ పరిస్థితుల్లో రామ్ ని చూసిన మైరా.. 
 
“ ఏమైంది రామ్… అలా వణికి పోతున్నావేంటి… “
 
అని కంగారు పడుతూ అడుగుతుంది.. తన తల్లి కంగారు ని గమనించిన రామ్.. అసలు విషయాన్ని దాచి ,
 
“ అయ్యో.. అమ్మ, నాకేం కాలేదు.. అటు చూడు “ 
 
అని ఆ గదిలో ac వైపు చూపిస్తాడు.. ఆ ac చాలా టెంపరేచర్ లో ఉండి ఉంటుంది.. అపుడు రామ్…
 
“ ఆ ac వల్ల చలితో నా బాడీ వణికి పోతుంది.. “
 
అని చెప్పడం తో, మైరా అక్కడ ఉన్న రిమోట్ తీసుకుని, దాన్ని ఆఫ్ చేసి రామ్ కి పాలు ఇస్తూ, 
 
“ పాలు తాగి త్వరగా రెడి అవ్వు.. మనం బయటకి వెళ్తున్నాం.. “
 
అనగానే, రామ్ ఎక్సయిట్ మెంట్ ఆపుకోలేక ,
 
“ బయటికా, ఎక్కడికి అమ్మా.. “
 
అని చాలా హ్యాపీగా అడుగుతాడు.. దానికి మైరా నవ్వుతూ, రామ్ బుగ్గల్ని గిల్లుతూ, 
 
“ నీ ఫెవరేట్ స్పాట్ , ప్రకృతి వనానికి… “
 
అని అంటుంది.. ఆ మాట విన్న రామ్.. హుషారుగా పాలు తాగుతూనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన క్యూట్ క్యూట్ లుక్స్ తో వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు.. తరువాత మైరా ఆ గది నుంచి వెళ్లి పోగానే రామ్ హుషారు గా పైకి లేచి తన బాత్రూమ్ లోకి వెళ్తాడు.. 
 
   తరువాత హాల్ లో విక్రాంత్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు.. 

 
    “ విక్రమ్, నువ్వు చేసిన ఈ తప్పు వల్ల సృష్టి లో ప్రకృతి కి ముప్పు జరగ బోతుంది.. నీవు చేసిన తప్పుకి నేను వేస్తున్న శిక్ష, తక్షణమే నువ్వు బొమ్మలా మారిపోవాలి.. రాబోయే కాలం లో ఒక కారణ జన్ముడు జన్మించ బోతున్నాడు.. అతని కార్యానికి నువ్వు సహాయ పడి అతని విజయానికి కారణం అయినపుడు నీకు ఈ శాపం నుంచి విముక్తి కలుగుతుంది.. అంత వరకు నీవు ఇలా బొమ్మ లాగే ఉండి పోతావు.. “
 
సీ మిస్టర్ హెన్రీ.. మీరు చెప్పిన దానికి నేను అస్సలు ఒప్పుకొను.. అలా చేస్తే ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోతాయి.. “
 
అని అనగానే , అవతలి వైపు నుంచి గంభీర మైన గొంతు తో.. 
 
“ ఇదే ఫైనల్ డిసీసన్ అయితే జరగ బోయే వాటిని ఎదురుకోవడానికి సిద్దంగా ఉండు.. “
 
అని వార్నింగ్ టోన్ లో చెప్పి ఫోన్ కట్ చేస్తాడు హెన్రీ… విక్రాంత్ కూడా కోపముగా ఫోన్ కట్ చేసి.. 
 
“ ఇడియట్స్… , మీరు ఎంత బెదిరించిన ఆ ప్రాజెక్టు మీకు దక్కనివ్వను..” 
 
అని అనుకుంటాడు…అపుడే వెనక్కి తిరిగి చూసిన అతని ముందు చాలా అందంగా రెడీ అయ్యి గ్రీన్ శారీ లో , తెల్లని ఒంటి రంగు తో చాలా గ్లామరస్ గా కనిపించి విక్రాంత్ ని అట్రాక్ట్ చేసింది మైరా .. విక్రాంత్ మైరా ని చూసి ఒక్క క్షణం తనని తాను మరచి పోయాడు.. అపుడు అలా తననే చూస్తూ ఉన్న విక్రాంత్ ని మైరా కదిపి… 
ఏవండోయ్ శ్రీ వారు.. “
 
అని అనగానే, తేరుకున్న విక్రాంత్… మైరా వైపు చూసి తడ బడుతూ , 
 
“ రెడీ నా , బయలు దేరుదామా.. “
 
అని అనడం తో, 
 
“ రెడీ నాన్న… “
 
అని రామ్ వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి నిలబడతాడు…ఆ తరువాత ముగ్గురు కలిసి అక్కడ నుంచి కారు లో బయలు దేరుతారు.. విక్రాంత్ వాళ్ళ కారు సముద్రానికి ఆనుకొని ఉన్న హై వే మీదుగా చాలా స్పీడ్ గా వెళ్తుంది.. కార్ వెనకాల కూర్చొని ఉన్న రామ్ కి ఒక వింత శబ్దం వస్తూ ,
 
“ రామ్… “
 
అని అతన్ని ఎవరో పిలిచినట్లు అనిపిస్తుంది.. రామ్ కి అది విచిత్రంగా అనిపించింది.. కాసేపటిలోనే ఆ కార్ ప్రకృతి వనం అనే భూతల స్వర్గం లోకి అడుగు పెడుతోంది… అక్కడి ప్రకృతి అందాలు చూడగానే రామ్ మనసుని కట్టి పడేశాయ్.. విక్రాంత్ లోపలికి ఎంటర్ అవగానే, కార్ ని పార్క్ చేసి, మైరాని, రామ్ ని తీసుకుని లోపలికి వెళతాడు.. అలా వెళ్తుండగా, రామ్ సడెన్ గా వెనక్కి తిరుగుతాడు.. దానికి కారణం అతన్ని వెనుక నుంచి ఎవరో గమనిస్తున్నారు అని రామ్ కి అనిపించడం వల్ల… 
 
     వాళ్ళు ఆ
వనం లోపలికి వెళ్లే కొద్దీ అక్కడ పెద్ద పెద్ద అందమైన చెట్లు, వాటర్ ఫౌంటైన్స్… అడవిలో ఉండే రక రకాల పక్షులు, జంతువులు అన్ని అక్కడ దర్శనం ఇస్తున్నాయి.. అవన్నీ చూస్తూ రామ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.. అలా వెళ్తున్న రామ్ దృష్టిని ఒక చిన్న చతురస్రాకారపు గాజు పెట్టెలో ఒక అడవి మొత్తం ఉన్న
ఒక ఆర్ట్ ని చూసి , వాళ్ళ అమ్మ నాన్న ల నుంచి పక్కకి వచ్చి , ఆ వస్తువు వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ గాజు పెట్టె దగ్గరకు వెళ్ళగానే, రామ్ దాన్ని టచ్ చేస్తాడు… అంతే వెంటనే రామ్ మాయం అవుతాడు….
 
    తరువాత రామ్ కనిపించడం లేదని చూసిన మైరా, విక్రాంత్ లు రామ్ ని వెతకడం లో పడి పోతారు.. 
 
ఇక ఇప్పుడు…
 
 అక్కడ మొత్తం వెతికినా కూడా రామ్ కనిపించ లేదని మైరా , విక్రాంత్ లు కంగారు పడుతుంటారు.. 
 
మరో వైపు, భయంకరమైన దట్టమైన అడవి.. ఆ అడవిలో రామ్ ,
 
“ అమ్మ, నాన్న… ఎక్కడున్నారు… “
 
అని అరుస్తూ , ముందుకు నడుస్తూ ఉన్నాడు.. అపుడే రామ్ కి మళ్లీ… 
 
“ రామ్ .. ఇక్కడికి రా… “
 
అని ఒక గొంతు వినిపిస్తుంది.. రామ్1 తనకి వినిపించిన గొంతుని అనుసరిస్తూ ముందుకు కదులుతూ ఉన్నాడు.. అతను ముందుకు వెళ్తుంటే ఆ గొంతు రామ్ కి మరింత ఎక్కువగా విని పిస్తుంది… అలా రామ్ వెళ్లి ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆగుతాడు.. ఆ చెట్టునే రామ్ వింత గా చూస్తూ ఉండగా, రామ్ ఆ చెట్టులో ఒక పెయింటింగ్ ఉందని చూసి, ఆ పెయింటింగ్ ని ముట్టుకుంటాడు.. అలా ముట్టుకోగానే , ఒక్క సారిగా ఆ అడవి మొత్తం చీకటి కమ్ము కుంటుంది… ఉరుములు మెరుపులతో ఆ అడవి అంత ప్రకృతి భీభత్సం చేస్తుంది. దానికి భయ పడ్డ రామ్ కింద పడి పైకి లేచి అక్కడ నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు.. ఉరుములు మెరుపుల శబ్దాలు రామ్ ని వెంటాడుతున్నాయి.. ఒక్క సారిగా రామ్ కాలికి ఏదో తగిలి కింద పడి పోతాడు.. తన కాలికి తగిలిన వస్తువును చూసి, రామ్ ఒక్క క్షణం షాక్ లో ఉండి పోయాడు..
 
ఇంతకీ రామ్ ఎక్కడున్నాడు.. ? రామ్ చూసిన ఆ వస్తువు ఏంటీ.. ? అసలు అక్కడ నుంచి రామ్ ఎలా బయట పడతాడు.. ? ఈ విక్రమ్ ఎవరు.. ? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలి అనుకుంటే   విక్రమధీర లో నెక్స్ట్ చాప్టర్ చదివేయాల్సిందే.


కామెంట్‌లు