పుస్తక ప్రపంచం42 సేకరణ ..అచ్యుతుని రాజ్యశ్రీ

 సాహిత్యంలో తొలి నోబెల్ బహుమతి పొందిన వాడు ఫ్రెంచ్ కవి వేదాంతి సల్లీ ప్రుడ్ హోం.తెలివి హృదయంకి కలిపేవారధి లాగా రాసిన కవిత కి 1901 లోస్వీడిష్ ఎకాడమీ ఇలా సత్కరించింది.స్టీఫెన్ హాకింగ్ అద్భుత మేధావి.ఆయన రాసిన ఎబ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం మోడరన్ క్లాసిక్ గా విశ్వమంతా నీరాజనాలు అందుకుంది.బ్లాక్ హోల్స్ బిగ్ బాంగ్ మొదలైన వాటినిసులభంగా విశదీకరించిన అద్భుత సైంటిస్ట్.2011లో స్వీడిష్ కవి టోమస్ ట్రాన్స్ ట్రోమర్ కి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది.80ఏళ్ల వయసులోగూడా ఆయన రాసిన కవితాసంపుటాలు15 పైగా 61 భాషల్లో అనువదింపబడినాయి.మడతలుగా హాస్యం మనతెలుగుసాహిత్యం సముద్రమంత ఉంది.ఇతర భాషలలోకి అనువాదంకాకపోవటంతో  ఎక్కువ ప్రచారంలోకి రావటంలేదు.హిందీ ఆంగ్లంలో అనువదింపబడితే కనీసం మన భారతదేశంలో నైనా గుర్తింపు వస్తుంది.బెంగాలీ హిందీ సాహితీవేత్తలు అందుకే అందరికీ తెలుసు🌹
కామెంట్‌లు