నా పంచపదుల సంఖ్య---1692-1693.1692.జనని నెప్పుల శ్రమ ,సహించ, కలిగే మన జన్మ!నాన్ననిరంతర,శ్రమతైలధార, వెలిగేఈజన్మ!గురు అక్షరాలా శ్రమ,తీర్చిదిద్ద సార్థకమే జన్మ!మన నిత్య శ్రమ కర్మ ఫలం,అనుభవం నరజన్మ!వెలకట్టలేనిది, జీవన కట్టడం, కట్టేది శ్రమే,పివిఎల్!1693.కర్షకుని శ్రమేగా అందరికీ, కడుపు నింపుతోంది!కార్మికుని స్వేదమే యంత్రాల ,ఇంధనమే అవుతోంది!సైనికుల చమటే ,దేశ రక్షణ కోట కడుతుంది!పౌరుల శ్రమే సారథిగా ,ప్రగతి రథం నడుస్తుంది!శ్రమతో సాగితేనే జీవనం,శ్రమ ఆగిందా రోదనం, పివిఎల్!_________
శ్రమ ఏవ జయతే!:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి