సిందూర్ ఆపరేషన్! ముష్కర్ దుష్మన్ పరేశాన్!:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
1.
ఓనాడు దేశానికి ,
ఉత్తరాన జరిగే కురుక్షేత్రం! 

ఈనాడు కాశ్మీరాన ఉప్పెన,
ఉగ్రవాద కుతంత్రం! 

మతోన్మాదానికి పర్యాటకుల, నిర్దాక్షిణ్య ప్రాణహరణం! 


ఉగ్రవాదం క్షణం క్షణం,
విస్తరిస్తున్న రణాల తోరణం!

రణం వ్రణం ఆపరేషన్, తక్షణం, కుక్కకాటుకి చెప్పుదెబ్బ, సిందూరం!

2.
నూట నలువది కోట్ల జనం అండ మన సైన్యానికి ఉండ!

త్రిదళాల సమైక్య పరాక్రమం, లావాప్రవాహమై నిండ!

తొమ్మిది స్థావరాలు క్షణంలో,
 భస్మమై నేల పరుండ!

ప్రతి సైనికుడు విజయుడు సంధింఛె పాశుపతం !

ప్రతి యోధుడు రుద్రుడు తెరచినాడు త్రినేత్రం! 

3.
భారత వీరుడు లేచాడు, పరాక్రమసింధువై నిలిచాడు! 

దుర్మార్గుల భరతం పట్టాడు, సహనం అంటే చవిచూపాడు! 

త్రివర్ణ పతాకం విశ్వాన,
విజయకేతనం,ఎగురవేశాడు!

ధంబానికి శృంగ భంగం ,
      ఇది కేవలం ఆరంభం! 

ఇగిరిపోని పరాక్రమ గంధం,
మరో సిందూర పూర్వరంగం!
_________
.

కామెంట్‌లు