"ఆరని జ్యోతి.:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
మరుల కురులు ,
కాలాన రాలేవి!

పెదాల మధువుల ,
ఊటలు ఎండేవి! 

కన్నుల చూపులు, ఎండమావులు అవి! 

నాసిక సంపంగి వాడ. ముక్కుపుడక రాల! 

కపోలాల తశతళలు ,
మసక బారిన వెన్నెలలు!

చెవుల జూకాలు నేల,
జారిపోయే సౌరులు! 

శంఖం కంఠం చూసే,
కంటికి, అష్టవంకరలు! 

శరీర లావణ్యం వార్ధక్యం ,
శాపమే పెడుతుంది! 

అసలు శరీరమే చేష్టలుడిగి,
 అచేతన పూతన అవుతుంది! 

హృదయం ప్రేమ జ్యోతి,,
ఆరక, ఆగక వెలుగుతుంది! 
_________


కామెంట్‌లు