కూటి కోసం కోటి విద్యలు :- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497

 కూటి కొసం కోటి విద్యలు 
అది కులవృత్తియైన
ఉన్నతోద్యోగమైన, సాప్ట్వేర్ ఇంజనీర్లైన , డాక్టర్లైనా  
దేశ సౌభాగ్యం కోసమే కదా
ఆధునిక కాలంలో Liberalisation 
Privatisation 
Globalization 
మూలంగా వృత్తులన్ని
కార్పోరేట్ శక్తుల కబందహస్తాల్లోకి చేరిపోయి
వృత్తులే నమ్ముకొని బతుకుతున్న వారు తినడానికి తిండి లేక ఆకలి చావులు చస్తున్నారు.
కొన్ని వృత్తి పనులు నేడు కార్పోరేట్ సొబగులద్దుకొని
(మెన్ ,ఉమెన్ బ్యూటీపార్లర్)
సామాన్యులు ఈ సౌకర్యం అందుకోలేని దశకు చేర్చారు
వ్యవసాయం కార్పోరేట్ల వశమై
చిన్న సన్నకారు రైతులు 
వ్యవసాయ కూలీలు పనిపాటలేక పస్తులతో కాలమెల్లదీస్తున్నారు
ఇబ్బడిముబ్బడిగా విద్యాలయాలను పెంచి చదువులో నాణ్యత కొరవడి నిరుద్యోగం పెంచి పోషిస్తున్న ప్రభుత్వం
 దేశాభివృద్ధికి యువతే ప్రధానమన్న విషయాన్ని తుంగలో తొక్కిరి.
చిన్న చేపను పెద్దచేప ,
చిన్న వ్యాపారాలను బహుళజాతి సంస్థలు కుప్పకూల్చివేస్తున్నాయి.
ఈ అననుకూల పరిస్థితిని ప్రభుత్వ పాలకులు మార్చాలి
ఇప్పుడు ఉన్న అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘాల ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి యువతను ఆదుకోవాలి 
రేపటి దేశ భవిష్యత్తుకు నేటి నుంచే ఆదర్శప్రణాళికలు రూపకల్పన చేసి సజావుగా అమలు చేయాలి 
తద్వారా దేశ సౌభాగ్యానికి బంగారు బాటలు వేయాలి
సర్వజన హితాయ
సర్వజన సుఖాయ

కామెంట్‌లు