అమ్మ ఎవరెస్ట్ శిఖరం
అమ్మ ఆశావాది
అమ్మ అనంత చైతన్యస్వరూపం
అమ్మ మార్గదర్శి
అమ్మ త్యాగమూర్తి
అమ్మను నిర్వహించాలంటే
అమ్మ అనే వ్రాయాలి
మరో పదానికి అందనిది
అమ్మ ఘనత
ఆధునిక కాలంలో ఎందుకో
కొందరు తల్లులు
తమ అందం చెడునని
స్తన్యం ఇవ్వడమే మానేసారు
అమ్మ చనుబాల లో బిడ్డలకు
కావలసిన ఔషధీ గుణాలు,
సూక్ష్మ స్థూల పోషకాలు
పుష్కలంగా ఉన్నాయి
వయస్సుతో పాటు వన్నెతగ్గే
దేహంపై అంత వ్యామోహం వద్దు
రేపు మీబిడ్డలు జాతినుద్దరించేవారైతే
మీ పెంపకాన్ని
మిమ్మల్ని వేనోళ్ళ కొనియాడుతారు
అమ్మకు జేజేలు
ఆత్మీయపు కొమ్మకు జేజేలు
ఆ దృశ్యం అపురూపం
అద్వితీయం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి