భారతీయుడా.. కదలిరా..!!-బచ్చుప్రభాకరరావు కోడూరు -9666723693
 సాహితీ కవి కళాపీఠం..!
సాహితీ కెరటాలు..!
==============
నేటి భారతం అంతా ఆన్లైన్బెట్టింగుల మాయాజాలం..!
ఆ మాయలో పడకు.. సొమ్ముపోగొట్టుకోకు..!
సమాజాన్నిమేల్కొల్ప టం భారతీయులుగా మన కర్తవ్యము..!
నేటి భారతంలో..ఎక్కడ చూసినా.. దోపిడీలు..హత్యలు దౌర్జన్యాలు..!
కుల మతాలకొట్లాటలు..నీతి గల నాయకులను ఎక్కడ వెతికినా..!
 కానరారు..మన సమాజములో..వాటిని మనమంతా..!
కనిపెట్టి.. నిలబెట్టి.. తేల్చుట  నిగ్గును..మన
కర్తవ్యము..!
నేటి భారతంలో.. తల్లిదండ్రులన్నా.. గురువులన్నా..
నీతి నియమాలన్నా..!
లెక్కలేదు..నేటియువతకు..వారిలో మార్పును..!
తెచ్చుట మనకర్తవ్యము
దేశభక్తిని నింపుట మన
కర్తవ్యము..!
నేటి భారతంలో  పొలాలను పూడ్చి.. చెట్లను పెకలించి..!
 ఫ్యాక్టరీలు కట్టి..కాలుష్యం పెరిగితే..
వనాలను పెంచి కాలుష్యాన్ని నివారించుట.. మనందరి కర్తవ్యముకాదా..!
********

కామెంట్‌లు