సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
=============
"నాన్న" నేను కోరిన కోరికలు నెరవేర్చే నా కల్పవృక్షం...
మండుటెండల్లో కూడా నాపై హిమవర్షం కురిపించే మహావృక్షం.
"నాన్న" నా ఉజ్వల భవితకు విరుల దారులు
వేయుటకు తాను ముళ్ళబాటని స్వీకరించే మహనీయుడు....
నా గెలుపు కోసం తాను ఎన్ని ఓటములనైనా ఆనందించే మహానుభావుడు.
"నాన్న" నాకు రోజూ విందు భోజనం పెట్టడం కోసం
తాను గెంజినీళ్ళతో కడుపు నింపుకునే త్యాగధనుడు....
నాకు పాలరాతి మేడలు నిర్మించడం కోసం
తన కలల సౌధాన్ని కూల్చుకునే కరుణామయుడు.
"నాన్న" నా కోసం ప్రపంచానికి ఎదురునిలిచే వీరుడు....
నా కలను నెరవేర్చడానికి ఎన్ని కథనాలకైనా కథం తొక్కే ధీరుడు.
"నాన్న" నేను నిర్మించుకున్న నా ఊహల రాజ్యానికి మారాజు...
.నా జీవిత గమనానికి వెలుగును నింపే రేరాజు.
"నాన్న"నాడు నన్ను ప్రగతి పథంలో నడపడానికి ఆయన ఆశల్ని అగ్నికి ఆహుతి పట్టిన త్యాగశీలి....నేడు నా నయనాలను ఆనంద భాష్పాలతో అభిషేకింపజేసిన ప్రతిభాశాలి.
నాన్న ఓ అద్భుతం :- వక్కపాటి లోవరాజు - పిఠాపురం భోగాపురం-చరవాణి:-9676520631
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి