నోటి మాట జాగ్రత్త!:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
బంధాలను కలిపేది
గాయాలను చేసేది
నోటి మాట జాగ్రత్త!
హృదయాలను విరిచేది

కాపురాలు కూల్చేది
నిప్పులను పోసేది
నోటి మాట జాగ్రత్త!
సమైక్యత చెడగొట్టేది

మనస్పర్థలు తెచ్చేది
స్నేహాలను చెరిపేది
నోటి మాట జాగ్రత్త!
సంతసం హరించేది

కష్టాలను పెంచేది
నష్టాలను పంచేది
నోటి మాట జాగ్రత్త!
ద్వేషం రగిలించేది

ఊపిరి పోసేది
ఊరట కల్గించేది
నోటి మాట జాగ్రత్త!
ప్రాణాలు తీసేది

కారణం బాధలకు
అనునిత్యం గొడవలకు
నోటి మాట జాగ్రత్త!
మనశ్శాంతి పోవుటకు


కామెంట్‌లు