ఖగోళ యాత్ర:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
నీలాల నింగిలో
మేఘాల తేరులో
విహరిద్దాం హాయిగా
చుక్కల లోకంలో

కదిలే మేఘంలో
చంద్రుని చేరువలో
బలే మజా ఉంటుంది
తారకల చెలిమిలో

కురిసే వెన్నెల్లో
విరిసే చినుకుల్లో
ఆహ్లాదం పండును
ఆనందం చిందును

ఊహల రెక్కలతో
ఖగోళ ఊసులతో
సందడే చేసేద్దాం
చకచక చూసొద్దాం


కామెంట్‌లు